NTR Brother in Law Narne Nithin Next Movie Sri Sri Sri Raja Vaaru Releasing Update by Producer
Sri Sri Sri Raja Vaaru : ఎన్టీఆర్(NTR) బామ్మర్ది నార్నె నితిన్(Narne Nithin) ఇటీవల మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తో వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. నార్నె నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారు ఆల్రెడీ ప్రకటించి షూటింగ్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాపై చిత్ర నిర్మాత అప్డేట్ ఇచ్చారు.
సత్యదేవ్‌తో గుర్తుందా శీతాకాలం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన నిర్మాత చింతపల్లి రామారావు ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారుని నిర్మిస్తున్నారు. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మాణంలో నార్నే నితిన్ సోలో హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Prabhas : రేపు పొద్దున్నే బీమవరంలో.. కోడి పందాల వద్ద డిజిటల్ ప్రభాస్ జాతర.. మారుతి సినిమా కోసం..
నేడు మీడియాతో చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ రాజా వారు సినిమా మంచి కమర్షియల్ మూవీ. ఈ నెలలోనే ఫస్ట్ కాపీ సిద్ధం కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తాం. ఆ తర్వాత కన్నడలో ప్రముఖ స్టార్ తో ఓ సినిమా, మరాఠీలో ఓ సినిమా, తెలుగులో కూడా ఓ స్టార్ హీరోతో ఈ ఇయర్ ఎండింగ్ ఓ భారీ సినిమా చేయబోతున్నాను. భారీ సినిమాలు కమర్షియల్ వాల్యూస్ తో పాటు, సమాజానికి మేలు చేసే అంశాలు ఉండేలా నిర్మిస్తాను అని అన్నారు. ఇక నార్నె నితిన్ శ్రీశ్రీశ్రీ రాజా వారు సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఎన్టీఆర్ రావొచ్చు అని సమాచారం.