Devara Collections : హమ్మయ్య బ్రేక్ ఈవెన్ అయిన ‘దేవర’.. ఆరు రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?
దేవర సినిమా ఆల్మోస్ట్ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయిందని సమాచారం.

NTR Devara Movie Six Days World Wide Collections Details Here
Devara Collections : ఎన్టీఆర్ దేవర సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా నిన్నటి వరకు అంటే రిలీజయిన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 396 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించింది.
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఇప్పటికి 396 కోట్లు కలెక్ట్ చేయడంతో సినిమా ఆల్మోస్ట్ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయిందని సమాచారం. ఇవాళ్టి నుంచి దసరా సెలవులు కూడా ఉండటంతో కలెక్షన్స్ నేటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని మూవీ యూనిట్ భావిస్తున్నారు.
దేవర సినిమా 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. దసరా వరకు దేవర సినిమా ఈజీగా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక తాజాగా దేవర సినిమా సక్సెస్ మీట్ ఉండదు అని తెలిపి అభిమానులకు క్షమాపణలు చెప్పారు నిర్మాత నాగవంశీ.
It’s his Brutal Massacre…
Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024