Devara Collections : దేవర రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..? ఫస్ట్ డే కంటే సగానికి సగం పడిపోయిన కలెక్షన్స్..
దేవర సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి.

NTR Devara Movie Two Days World Wide Collections Here Details
Devara Collections : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజయి పాజిటివ్ టాక్ తో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇక దేవర సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. మొదటి రోజు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా రెండు రోజులకు గాను దేవర సినిమా 243 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
అంటే దేవర సినిమా రెండో రోజు కేవలం 71 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మొదటి రోజు కలెక్షన్స్ లో సగం కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే నేడు ఆదివారం, మరో రెండు రోజుల్లో దసరా సెలవులు మొదలవుతుండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
Also Read : Allu Arjun – Allu Sneha Reddy : భార్యకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన బన్నీ.. సెల్ఫీలు పోస్ట్ చేసి..
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. సెలవులు, దేవర కలెక్షన్స్ చూస్తుంటే ఈజీగా 500 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
Weapons of DESTRUCTION…….
unleashing FEAR that no corner can hide from!! 🔥🔥🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/hhrT5g5ZU0— Devara (@DevaraMovie) September 29, 2024