Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. వైరల్ అవుతున్న ప్లేస్, డేట్, గెస్ట్..
తెలుగులో మాత్రం దేవర ప్రమోషన్స్ తక్కువగానే ఉంటాయని సమాచారం.

NTR Devara Pre Release Event Date Rumours goes Viral
Devara Pre Release Event : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలు పెంచారు. దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ ఘనంగా చేసి, పలు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు.
అయితే తెలుగులో మాత్రం దేవర ప్రమోషన్స్ తక్కువగానే ఉంటాయని సమాచారం. కొన్ని ముందే చేసిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేసి ఎలాంటి ప్రెస్ మెట్ లేకుండా కేవలం ఒక్కటే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని తెలుస్తుంది. ఫ్యాన్స్ కోసం దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న గ్రాండ్ గా చేస్తారని సమాచారం. కుదిరితే రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ సినిమాలకు చేసినట్టు చేద్దామని లేదా ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో చేద్దామని ప్లాన్ చేస్తున్నారట దేవర యూనిట్.
Also Read : Devara : వామ్మో.. ‘దేవర’ తెలుగులో హిట్ కొట్టాలంటే అంత కలెక్ట్ చేయాలా? ఎన్టీఆర్‌కి భారీ టార్గెట్..
ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా వస్తాడని టాక్ వినిపిస్తుంది. గతంలో మహేష్ బాబు సినిమాకు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివతో ఉన్న బంధం కారణంగా అప్పుడు ఎన్టీఆర్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ వెళ్లి మహేష్ బాబుని దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మని అడిగారని అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదని సమాచారం. మహేష్ బాబు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మహేష్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే మరోసారి స్టేజిపై ఎన్టీఆర్, మహేష్ లను కలిసి చూడవచ్చని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.