Ntr Dragon: డ్రాగన్ మూవీలో ‘లూగర్’గా ఎన్టీఆర్.. ‘LUGER’ కి అర్థం ఇదేనా? రెండో ప్రపంచ యుద్దానికి లింక్
డ్రాగన్(Ntr Dragon) సినిమాలో ఎన్టీఆర్ పేరు లూగర్ మీనింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NTR Dragon Luger name meaning going viral on social media
- ‘డ్రాగన్’ టీజర్లో ఎన్టీఆర్ పేరు ‘LUGER’
- జర్మన్ పిస్టల్ పేరుతో క్యారెక్టరైజేషన్
- నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్
Ntr Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో ‘డ్రాగన్(Ntr Dragon)’ ఒకటి. హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా పవర్ఫుల్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Megastar Chiranjeevi: టీజీఈఏపీసెట్ టాపర్ రుషిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. ఫొటోలు వైరల్
ఈ టీజర్ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరును ‘LUGER’ (లూగర్) అని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ విభిన్నమైన పేరు ఇప్పుడు నెటిజన్లలో, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటని ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. గూగుల్ సమాచారం ప్రకారం ‘LUGER’ అనేది రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మన్ సైన్యం ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్.
సైన్యంలో ప్రామాణిక వెపన్‌గా గుర్తింపు పొందిన ఈ పిస్టల్ పేరును ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు పెట్టడం వెనుక దర్శకుడి మాస్టర్ ప్లాన్ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా, శత్రువులపై గురితప్పకుండా వేటాడే ఆయుధంలా ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ కనెక్టివిటీపై మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
