NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఎంట్రీ వెనుక రీజన్ ఏంటి?

NTR entered into Allu Arjun pushpa 2 sets
NTR – Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 (Pushpa 2). ఫస్ట్ పార్ట్ దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని మ్యానరిజమ్స్ అండ్ డాన్స్ స్టెప్పులు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. దీంతో ఈ సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఈ చిత్రీకరణ జరుగుతుంది.
NTR – Pranathi : చార్మినార్ వద్ద ఎన్టీఆర్ భార్య ప్రణతి షాపింగ్.. ఫోటో వైరల్!
అయితే ఈ సెట్స్ లోకి బుధవారం (ఏప్రిల్ 26) జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పిక్ లో ఎన్టీఆర్ ఫార్మల్ లుక్ లో కనిపిస్తున్నాడు. NTR30 షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ లోకి ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఎన్టీఆర్ చేసిన ట్వీట్ దానికి బన్నీ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు బన్నీ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడంతో ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ అభిమానులు ఆ ఫోటోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Krishan Perera : దుబాయ్ జైలు నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ నటి..
ఇక NTR30 విషయానికి వస్తే.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ డైరెక్షన్ లో వీరిద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
#Pushpa2TheRule
Yesterday @tarak9999 visited @alluarjun and @aryasukku at #Pushpa2TheRule shooting spot … 👌🔥#AlluArjun #NTR #pushpa2 #Pushpa #PushpaImpossible #pushpa3therulebegins #pushparaj #pushpa2hindi pic.twitter.com/QxJZbWBwtt— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) April 27, 2023