NTR : తిరుమల స్వామి వారి సన్నిధిలో ఎన్టీఆర్ కుటుంబం..

ఎన్టీఆర్‌ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్.........

NTR : తిరుమల స్వామి వారి సన్నిధిలో ఎన్టీఆర్ కుటుంబం..

Lakshmi Pranathi

Updated On : March 15, 2022 / 1:29 PM IST

NTR :  యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రస్తుత ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Payal Rajput : తిరుపతిలో స్వామి వారిని దర్శించుకున్న పాయల్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ మరియు మరికొంతమంది బంధువులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మొక్కులు సమర్పించారు. తిరుమలలో పిల్లలతో కలిసి ఉన్న లక్ష్మి ప్రణతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిల్లల్ని చూసిన వారంతా చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వీరితో ఎన్టీఆర్ వెళ్ళకపోవడం గమనార్హం.