NTR : ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్.. గర్వంగా ఉందంటూ ఫ్యాన్స్..

అరుదైన గౌరవాన్ని అందుకున్న ఎన్టీఆర్. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ పేరుని అనౌన్స్ చేస్తూ..

NTR got place in actors branch at the Academy oscar

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు, గౌరవాలు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న ఈ హీరో తాజాగా మరో గౌరవాన్ని అందుకున్నాడు. ఆస్కార్ తన కొత్త మెంబెర్స్ లిస్ట్ ని నేడు ప్రకటించింది. ఇక ఈ లిస్ట్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అకాడమీ కమిటీ తెలియజేస్తూ ఒక పోస్టు చేసింది.

యాక్టర్స్ బ్రాంచ్‌ మెంబెర్‌గా ఎన్టీఆర్ కి అకాడమీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నిన్ను చూస్తుంటే చాలా గౌరవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో అకాడమీ తన కొత్త సభ్యుల జాబితాని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళు అయితే మిగిలిన ఇద్దరు.. కరణ్ జోహార్, షౌనక్ సేన్.

Also read : Renu Desai : జనసేన కోసం రేణూదేశాయ్ పని చేయబోతుందా..?

RRR సినిమా టీం నుంచి ఎన్టీఆర్, చరణ్, డిఒపి సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఉన్నారు. అప్పుడు సభ్యులుగా అనౌన్స్ చేసిన వారిని.. ఇప్పుడు క్లాస్‌లు వారిగా విభజించి అనౌన్స్ చేస్తుంది. ఈక్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ క్లాస్ లో కీరవాణిని, సినిమాటోగ్రాఫర్ క్లాస్ లో సెంథిల్ కుమార్ ని ఇప్పటికే అనౌన్స్ చేసింది. తాజాగా ఎన్టీఆర్ ని యాక్టర్స్ క్లాస్ లో మెంబెర్ గా అనౌన్స్ చేసింది.