NTR : తమిళ స్టార్ దర్శకుడితో మూవీ.. క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్..!
ఓ తమిళ దర్శకుడి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నాడు అనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి.

NTR indirectly confirms doing a film with Nelson under Naga Vamsis production
దేవర హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ చిత్రం వార్-2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాల తరువాత దేవర 2 మూవీ ఉండనుంది. కాగా.. గత కొన్ని రోజులుగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తారని అంటున్నారు.
దర్శకుడు నెల్సన్‌తో ఓ మూవీ చేస్తున్నామని, కానీ హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ నాగవంశీ తెలిపారు. కాగా దీనిపై ఎన్టీఆర్ పరోక్షంగా మాట్లాడారు. తాను నాగవంశీతో ఓ సినిమా చేయబోతున్నానని, ఆ సినిమా గురించి మరిన్ని వివరాలను ఆయన చెబుతారన్నాడు.
Peddi : రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్‌పై క్రేజీ టాక్..
శుక్రవారం మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాగవంశీ నిర్మాతగా నేను ఓ మూవీలో నటించనున్నాను. అది చాలా పెద్ద మూవీ. ఆ చిత్రం గురించి ఆయనే ప్రకటిస్తారు. ఆ సినిమా ప్రారంభమైన రోజు మీ అందరిని హ్యాండిల్ చేసే బాధ్యతను ఆయనకే అప్పగించబోతున్నాను. అని అన్నారు.
దీంతో నాగవంశీ నిర్మాతగా ఎన్టీఆర్ నటించబోయే చిత్రానికి నెల్సన్ దర్శకుడు అని అంతా ఫిక్స్ అయ్యారు. డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో నెల్సన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్నాడు.