కథానాయకుడు కొన్నవారికే మహానాయకుడు
ఫస్ట్ టైమ్ తను నిర్మాతగా మారి తీసిన సినిమా వల్ల ఎవరూ నష్ట పోకూడదని, కథానాయకుడు కొన్న బయ్యర్లకే మహానాయకుడు హక్కులు ఇచ్చాడు బాలయ్య..

ఫస్ట్ టైమ్ తను నిర్మాతగా మారి తీసిన సినిమా వల్ల ఎవరూ నష్ట పోకూడదని, కథానాయకుడు కొన్న బయ్యర్లకే మహానాయకుడు హక్కులు ఇచ్చాడు బాలయ్య..
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్.. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల మధ్య, జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలయ్య వేసిన పలు గెటప్స్ బాగున్నాయనీ, తండ్రి పాత్రలో ఒదిగిపోయాడనీ, తండ్రి వారసత్వాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్నాడనీ, ఎన్టీఆర్‌కి బాలయ్య ఇచ్చే ఘనమైన నివాళి ఇదే.. అంటూ ప్రశంసలు వచ్చాయి.. కానీ, కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. బయ్యర్లు చాలా వరకు నష్ట పోయారు.. సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా సెకండ్ పార్ట్ వేరే డిస్ట్రిబ్యూటర్స్‌కి అమ్మేసి, సోమ్ము చేసుకోవచ్చు.. కానీ, బాలయ్య ఆ పని చెయ్యలేదు.. ఇండస్ట్రీలో బాలయ్యని నిర్మాతల హీరో అంటుంటారు.
ఫస్ట్ టైమ్ తను నిర్మాతగా మారి తీసిన సినిమా వల్ల ఎవరూ నష్ట పోకూడదని, కథానాయకుడు కొన్న బయ్యర్లకే మహానాయకుడు హక్కులు ఇచ్చాడు బాలయ్య.. ఫస్ట్‌పార్ట్‌లో జరిగిన మిస్టేక్స్, రెండో పార్ట్‌విషయంలో జరగకుండా మూవీ యూనిట్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందనీ, ఫస్ట్ పార్ట్ కంటే, మహానాయకుడు లోనే ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనీ, అభిమానులనూ, ప్రేక్షకులనూ తప్పకుండా ఆకట్టుకుంటుందనీ మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. మరో ట్రైలర్ కూడా రానుందనీ, ఈ నెల 16 న ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందనీ తెలుస్తుంది..