NTR – Mokshagna Teja : నందమూరి మల్టీస్టారర్‌తో బాలయ్య వారసుడు ఎంట్రీ.. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్-మోక్షజ్ఞ..

నందమూరి మల్టీస్టారర్‌తో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ..

NTR – Mokshagna Teja : నందమూరి మల్టీస్టారర్‌తో బాలయ్య వారసుడు ఎంట్రీ.. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్-మోక్షజ్ఞ..

NTR Mokshagna Teja multistarrer Kalyan Ram as producer Balakrishna

Updated On : August 23, 2023 / 4:42 PM IST

NTR – Mokshagna Teja : నందమూరి అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విషయం.. బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య తోటి నటులు చిరంజీవి, నాగార్జున వారసులు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం అప్పుడు, ఇప్పుడు అంటూ వార్తలు తప్ప సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం లేదు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులకు పండుగలాంటి ఒక వార్త వినిపిస్తుంది. మోక్షజ్ఞ తెరగేట్రంకి ముహూర్తం ఫిక్స్ అయింది. అదికూడా మల్టీస్టారర్‌ చిత్రమట.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లకు జరిగిందా.. ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల హ్యాట్రిక్ కొడతాడా?

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కాంబినేషన్‌లోనే ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. నందమూరి బ్రదర్స్ సినిమాకి మరో బ్రదర్ కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నిర్మాతగా వ్యవహరించనున్నారని ఇండస్ట్రీ టాక్. ఇతర హీరోల వారసులు ఎంట్రీలా కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా మోక్షజ్ఞ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారట. సోలో హీరోగా కాకుండా మొదటి సినిమాలోనే మల్టీస్టారర్ మూవీలో ఎంట్రీ ఉండాలని చూస్తున్నారట. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తొలి చిత్రంలో నటించాలని మోక్షజ్ఞ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. యాక్షన్‌లో ప్రత్యేక ముద్ర వేసుకున్న జూనియర్ పక్కన నటించి, తన ప్రత్యేకత చాటుకోవాలని మోక్షజ్ఞ భావిస్తున్నాడట.

NTR 100 Rupees Coin : ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణేం విడుదల చేయనున్న రాష్ట్రపతి.. హాజరుకానున్న చంద్రబాబు

టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన జూనియర్ ఎన్టీఆర్-మోక్షజ్ఞ మూవీకి నిర్మాతగా నందమూరి కల్యాణ్‌రామ్ వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత బ్యానర్‌లోనే తొలిసినిమా చేయడంతోపాటు తన కుటుంబంలో ఇతర నటులతోనే ఎంట్రీ ఇవ్వాలని మోక్షజ్ఞ భావించడం.. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్‌ను ఆకర్షిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌కు వెళ్లిన తెలుగు సినిమా రంగంలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ తొలి సినిమాను ఒక్క మాతృభాషకే పరిమితం చేస్తారా? బహు భాషల్లో విడుదల చేస్తారన్నదే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్-మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే చిత్రంపై త్వరలో ప్రకటన చేస్తారని అంటున్నారు.