Bhagavanth Kesari : భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లకు జరిగిందా.. ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల హ్యాట్రిక్ కొడతాడా?
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్. అయితే భగవంత్ కేసరి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం.

Balakrishna Bhagavanth Kesari Movie Pre Release Business
Bhagavanth Kesari Movie : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటిస్తోండగా శ్రీలీల(Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక బాలయ్య బాబు తెలంగాణ యాసలో మాట్లాడుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్. అయితే భగవంత్ కేసరి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం.
Samantha : అప్పుడే అమెరికాలో వర్కౌట్లు మొదలుపెట్టేసిన సమంత.. న్యూయార్క్ గాలిలో ఏదో ఉంది..
బాలకృష్ణ గత రెండు సినిమాలు అఖండ, వీరసింహ రెడ్డి సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించాయి. ఆ సినిమాలకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. అవి పెద్ద హిట్ అవ్వడంతో భగవంత్ కేసరి సినిమాకు కూడా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం థియేట్రికల్ రైట్స్ దాదాపు 70 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం. గత సినిమా వీరసింహరెడ్డి కూడా ఇదే రేంజ్ లో అమ్ముడయింది. ఇక మిగిలిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలకు మరింత లాభమే. మరి ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలయ్య బాబు హ్యాట్రిక్ 100 కోట్ల సినిమా కొడతాడా చూడాలి. బాలయ్య అభిమానులు దసరా నాడు భగవంత్ కేసరి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.