Site icon 10TV Telugu

NTR Remuneration : వాట్.. హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారా? వార్ 2 లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?

NTR Remuneration is More Than Hrithik Roshan in War 2

NTR Remuneration

NTR Remuneration : యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వార్ -2 సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

తాజాగా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ చర్చగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఎన్టీఆర్ RRR, దేవర సినిమాలకు 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఇప్పుడు వార్ 2 సినిమాకు ఇంకో 10 కోట్లు పెంచి 60 కోట్లు తీసుకున్నాడని సమాచారం. బాలీవుడ్ లో ఎలాగో రెమ్యునరేషన్స్ ఎక్కువే ఉంటాయి. సినిమా కూడా భారీ బడ్జెట్, ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో అంత ఇచ్చారట.

Also Read : Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కంటే తక్కువ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. హృతిక్ కి ఈ సినిమాకు 50 కోట్లే ఇచ్చారని అంటున్నారు. దీన్ని హృతిక్ ఫ్యాన్స్, బాలీవుడ్ జనాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. సినిమాలో మెయిన్ హీరో హృతిక్ అని, హృతిక్ బాలీవుడ్ స్టార్ అని, 50 కంటే ఎక్కువే ఇచ్చి ఉంటారని, ఎన్టీఆర్ కంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

ఇక వార్ 2 లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీకి 15 కోట్లు ఇచ్చారని, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 30 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అయితే ఇవి ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఎన్టీఆర్ హృతిక్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చగా మారింది.

Also Read : Athadu : ‘అతడు’ సినిమాలో చూపించిన ఇల్లు ఏమైపోయిందో తెలుసా? అలా ప్లాన్ చేద్దాం అనుకుంటే.. పాపం..

Exit mobile version