Bhargav Ram : ఎన్టీఆర్ రెండో తనయుడు భార్గవ్ రామ్ బర్త్‌డే.. ట్విట్టర్లో ట్రెండింగ్..

నేడు జూన్ 14న భార్గవ్ రామ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు భార్గవ్ రామ్ కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం భార్గవ్ రామ్ ట్రెండింగ్ లో ఉన్నాడు.

Bhargav Ram : ఎన్టీఆర్ రెండో తనయుడు భార్గవ్ రామ్ బర్త్‌డే.. ట్విట్టర్లో ట్రెండింగ్..

NTR second son Bhargav Ram Birthday photos and wishes goes viral

Updated On : June 14, 2023 / 3:01 PM IST

NTR : జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దేశమంతటా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల(Koratala) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా, బాలీవుడ్(Bollywood) లో హృతిక్ రోషన్(Hruthik Roshan) తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మాత్రం కొంచెం తక్కువగానే యాక్టివ్ గా ఉంటాడు. గతంలో అయితే అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు కాదు ఎన్టీఆర్. RRR సమయం నుంచే కొంచెం యాక్టివ్ అయి తన ఫోటోలు, అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తాడు. ఎన్టీఆర్ చాలా రేర్ గా తన భార్య, తన పిల్లల ఫోటోలు షేర్ చేస్తాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి(Pranathi) అందరికి పరిచయమే. ఇక ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అభయ్ రామ్(Abhay Ram) కాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్(Bhargav Ram).

Sreeleela : శ్రీలీల బర్త్‌డే.. ఒక్కరోజే ఇన్ని సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్.. ఫుల్ ఫామ్ లో ఉందిగా..

నేడు జూన్ 14న భార్గవ్ రామ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు భార్గవ్ రామ్ కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం భార్గవ్ రామ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. గతంలో భార్గవ్ తో, తన పిల్లలతో ఉన్న కొన్ని ఫోటోలు ఎన్టీఆర్ షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. భార్గవ్ రామ్ కి ఇది అయిదవ పుట్టిన రోజు. ఎంత క్యూట్ గా ఉన్నాడో అంటూ అభిమానులు భార్గవ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్ లో కనపడగా అప్పుడు భార్గవ్ రామ్ మీడియా కంట పడ్డాడు.