NTR : ఎన్టీఆర్ పిల్లలని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నారో
ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఈ వీడియోలు, ఫోటోలలో ఉండటంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి, ఎన్టీఆర్ అభిమానులతో పాటు నెటిజన్లు ఈ ఫోటోలని చూసి ఎన్టీఆర్ పిల్లలు ఎంత క్యూట్ గా...

Ntr Sons
NTR Sons : యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వరుస పోస్టులు పెడుతున్నారు. ఇక తన ఫ్యామిలీ పిక్స్ ని ఎక్కువగా షేర్ చేయరు. తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలని చాలా అరుదుగా షేర్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ తనయుల ఫోటోలు బయటకి వస్తే అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ మరియు మరికొంతమంది బంధువులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీంతో తిరుమలలో మీడియా వీరిని ఫోటోలు, వీడియోలు తీసింది. ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఈ వీడియోలు, ఫోటోలలో ఉండటంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి, ఎన్టీఆర్ అభిమానులతో పాటు నెటిజన్లు ఈ ఫోటోలని చూసి ఎన్టీఆర్ పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
NTR : తిరుమల స్వామి వారి సన్నిధిలో ఎన్టీఆర్ కుటుంబం..
అందరూ కలిసి దిగిన ఫొటోలో పిల్లలు ఇద్దరూ నవ్వుతు చాలా క్యూట్ గా ఉన్నారు. ఇక తల్లి చెయ్యి పట్టుకొని ఇద్దరు ముద్దు ముద్దుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చిన్న కొడుకు భార్గవ్ రామ్ నుదిటిన మూడు నామాలు పెట్టుకొని నవ్వుతు ఉన్న ఫోటో మరింత అందంగా క్యూట్ గా ఉంది. ఈ ఫోటో మారినంత వైరల్ అవుతుంది. నాలుగు నెలల క్రితం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు తన పిల్లల ఫోటోలని షేర్ చేశారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ తనయుల ఫోటోలు బయటకి రావడంతో అందరు వీటిని షేర్ చేస్తున్నారు.