Nushrratt Bharuccha
Nushrratt Bharuccha : సినీ పరిశ్రమలో స్టార్స్ ని, మాములు నటీనటులు, ఒక్కోలాగా చూస్తారని తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా తాను స్టార్ అవ్వకముందు సినీ పరిశ్రమలో ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నుష్రత్ బరుచా మాట్లాడుతూ.. ఇక్కడ సినీ పరిశ్రమలో ఒక అబ్బాయి హిట్ కొడితే అతను నేపో కిడ్ అయినా బయటి వాడు అయినా అవకాశాలు బోలెడు వస్తాయి. కానీ ఒక అమ్మాయి హిట్ కొట్టినా కష్టాలు పడాల్సిందే. అవకాశాలు అంతగా రావు. హీరోలకు వచ్చినన్ని అవకాశాలు మాకు రావు. నేను 2011 నుంచి ఇక్కడ ఉన్నా. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశాను అని తెలిపింది.
Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్.. స్పెషల్ సాంగ్ కోసం అడుగుపెట్టిన మెగాస్టార్..
అలాగే.. ఓ సారి షూటింగ్ లో నాకు ఇచ్చిన కారవాన్ లో వాష్ రూమ్ బాగోకపోతే హీరో కారవాన్ వాడుకుందామని వెళ్ళాను. కానీ నన్ను వెళ్లనివ్వలేదు. అప్పుడు హీరో కూడా లేడు. ఒక 5 నిముషాలు వాష్ రూమ్ కి వాడుకుంటాను అన్నా వినలేదు. అప్పుడు నేను కంప్లైంట్ చేసే పొజిషన్ లో లేను. అప్పుడు ఇలాంటి సౌకర్యాలు అన్ని నేను కూడా ఏదో ఒక రోజుపొందుతాను అని నాకు నేను చెప్పుకున్నా అంటూ తెలిపింది. అయితే నుష్రత్ బరుచా చెప్పిన విషయాలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఆమెకు సపోర్ట్ గా కామెంట్ చేస్తుంటే పలువురు విమర్శలు చేస్తున్నారు.
Also Read : Mahavatar Narsimha : ‘మహావతార్ నరసింహ’ మూవీ రివ్యూ.. భక్త ప్రహ్లాద కథ యానిమేషన్ లో..