Vishwambhara : ‘విశ్వంభర’ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్.. స్పెషల్ సాంగ్ కోసం అడుగుపెట్టిన మెగాస్టార్..
నేడు విశ్వంభర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది.

Vishwambhara
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆ సినిమా కేరళ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దీనికంటే ముందు మొదలుపెట్టిన విశ్వంభర సినిమా మాత్రం VFX వల్ల సాగుతూ వస్తుంది. అయితే విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షూట్ ఇంకా పూర్తవ్వలేదు. ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు రోజులు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. VFX వల్లే సినిమా కాస్త లేట్ అవుతుంది అని తెలిపారు.
నేడు విశ్వంభర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం. ఆ తర్వాత రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో సినిమా షూట్ ని ముగిస్తారని తెలుస్తుంది.
Also Read : Mahavatar Narsimha : ‘మహావతార్ నరసింహ’ మూవీ రివ్యూ.. భక్త ప్రహ్లాద కథ యానిమేషన్ లో..
డైరెక్టర్ వశిష్ట షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటో షేర్ చేసి.. విశ్వంభర చివరి షెడ్యూల్ మొదలైంది. బాస్ నుంచి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ రానున్నాయి అని తెలిపాడు. మరి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Freezing this moment to celebrate later ❤️
A Dance Storm that'll make you BOSS-fied Shuruuuu 💥 🤙#Vishwambhara – Last Schedule begins! pic.twitter.com/rlAi8KQLfM
— Vassishta (@DirVassishta) July 25, 2025
Also Read : War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..