నూతన్ నాయుడుకు బెయిల్.. సెంట్రల్ జైలు నుంచి వచ్చేశాడు

Bail to Nutan Naidu: బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఒక దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్ట్ అయి సెంట్రల్ జైలుకు వెళ్లగా.. లేటెస్ట్‌గా అతనికి బెయిల్ వచ్చింది. అనకాపల్లి సబ్ జైలు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉంటున్న నూతన్ నాయుడును కోర్టు ఆదేశాలతో బెయిల్‌పై జైలు అధికారులు విడుదల చేశారు. ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ఏ8 ముద్దాయిగా ఉన్నాడు.
సెప్టెంబరు 3వ తేదీన బెంగుళూరు ఉడుపిలో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. తరువాత నూతన్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడి, అతనిపై మొత్తం ఆరు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి పేరుతో పలువురికి కాల్స్.. ఇలా పలురకాల కేసుల్లో ఆయనపై 3 అట్రాసిటీ సహా ఆరు కేసులను పోలీసులు నమోదు చేశారు. పెందుర్తిలో 2 , గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పీఎస్‌లలో ఒక్కో కేసు నమోదైంది.
https://10tv.in/balakrishna-is-good-at-heart-sehari-movie-actor-gives-clarity/
అయితే మొత్తం అన్నీ కేసుల్లోనూ నూతన్ నాయుడుకు ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఈ కేసుల్లో 70 రోజుల పాటు నూతన్ నాయుడు జైల్లో ఉన్నాడు. శిరోముండనం కేసులో మాత్రం నూతన్ నాయుడు భార్యతో సహా మిగిలిన ఏడుగురు అప్పట్లోనే బయటికి వచ్చేశారు. నూతన్ నాయుడు భార్య మధుప్రియా, మరో ఏడుగురిపై కేసులు నమోదవగా.. విశాఖపట్నం పోలీసులు ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.