SSMB 29 : ముందే మహేష్ – రాజమౌళి సినిమా గురించి లీక్ చేసిన డిప్యూటీ సీఎం.. షూట్ ఎక్కడ చేస్తున్నారో చెప్పేసి..

ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం మహేష్ - రాజమౌళి సినిమా షూట్ జరుగుతుంది.

Odisha Deputy CM Pravati Parida Post on Mahesh Babu Rajamouli SSMB 29 Movie on her Twitter

SSMB 29 : మహేష్ బాబు – రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా రాజమౌళి సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఒక షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సెట్స్ లో పూర్తిచేసి ఇటీవల రెండో షెడ్యూల్ షూటింగ్ కి ఒడిశా వెళ్లారు.

ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం మహేష్ – రాజమౌళి సినిమా షూట్ జరుగుతుంది. ఓ మూడు రోజుల క్రితం ఈ సినిమా షూట్ నుంచి మహేష్ బాబు వీడియో ఒకటి లీక్ అయింది. దీంతో మూవీ యూనిట్ జాగ్రత్తపడి సైబర్ క్రైమ్ ద్వారా ఆ వీడియో పోస్ట్ చేసిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్లాక్ చేయించింది. షూటింగ్ స్పాట్ లో కూడా సెక్యూరిటీని పెంచారు.

Also Read : Athiya Shetty – KL Rahul : ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. భార్యతో కలిసి బేబీ బంప్ ఫొటోలకు పోజులిచ్చిన KL రాహుల్..

అయితే రెండు రోజుల క్రితమే ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా మహేష్ – రాజమౌళి సినిమా షూట్ గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా తన సోషల్ మీడియాలో.. గతంలో మల్కనగిరిలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు రాజమౌళి తర్వాతి సినిమా SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు, పృద్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమా కోరాపుట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇది సినిమా షూటింగ్ కోసం ఒడిశాలో సినిమాటిక్ ప్రకృతి దృశ్యాలు చాలా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. ఇది ఒడిశా టూరిజంకు మంచి బూస్ట్ ఇస్తుంది. షూటింగ్స్ కి మంచి గమ్యస్థానం అవుతుంది. మేము అన్ని సినిమా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాము ఒడిశాలో మంచి లొకేషన్స్ చాలా ఉన్నాయి. అలాగే మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తామని వాగ్దానం చేస్తున్నాము అని రాసుకొచ్చారు.

Also Read : Nani – Vijay Deverakonda : పదేళ్ల తర్వాత అదే ఫోటో రీ క్రియేట్ చేసిన ‘నాని – విజయ్ దేవరకొండ’.. ఫోటో వైరల్.. ఫ్యాన్స్ ఇప్పటికైనా మారాలి..

దీంతో మహేష్ – రాజమౌళి సినిమా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ లో జరుగుతుందని తెలిపారు. కోరాపుట్ లో ఉన్న అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రెండు రోజుల ముందే ఒడిశా డిప్యూటీ సీఎం ఈ ట్వీట్ వేసినా కొంచెం ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. వేరే రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా మహేష్ – రాజమౌళి సినిమా గురించి అధికారికంగా ట్వీట్ వేశారంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.