Krrish 4 : క్రిష్-4 వచ్చేస్తుంది.. దర్శకుడిగా మారుతున్న హీరో..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

official Krrish 4 announced Hrithik Roshan making directorial debut
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కగా.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక నాలుగో భాగం కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా నాలుగో భాగానికి స్పందించిన అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషనే దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ తెలిపారు.
Prabhas : హైదరాబాద్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పిన హీరో టీమ్
’25 ఏళ్ల కిత్రం నిన్ను యాక్టర్‌గా ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్ 4’కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది .’అని రాకేశ్ రోషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
View this post on Instagram
ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు నిర్మిస్తున్నారు. క్రిష్ సిరీస్‌లో రూపుదిద్దుకున్న మూడు చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించడం విశేషం.
Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..
కాగా.. హృతిక్ రోషన్ ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు. ఇక ఇప్పుడు ఇంత పెద్ద సినిమాకు డైరెక్టర్‌గా చేయబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.
భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.