పీరియాడికల్ డ్రామాగా ‘తురముఖం’.. టీజర్ అదిరింది

Official Teaser Of The Anticipated Malayalam Movie Thuramukham
మళయాల స్టార్ హీరో నివిన్ పాలీ హీరోగా తెరకెక్కతోన్న సినిమా తురుముఖం. రాజీవ్ రవి దర్శకత్వంలో సుకుమార్ తెక్కేపాట్ నిర్మాణంలో రూపొందిన యాక్షన్ మూవీ తురుముఖం(Harbour). పీరియాడికల్ డ్రామాగా 1923-1957 మధ్యకాలంలో కొచ్చి హార్బర్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను లేటెస్ట్‌గా చిత్రయూనిట్ విడుదల చేసింది.
బ్రిటీష్ వారు పరిపాలించే కాలంలో హార్బర్‌ను నమ్ముకొని జీవించే అమాయక ప్రజల జీవితాల్లోకి దుష్ట శక్తులు ప్రవేశించగా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఓ యువకుడు ప్రజలకు దేవుడు ఎలా అయ్యాడు అనే కథాంశంతో చిత్రం తెరక్కుతుంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్‌కు భాషతో సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది.
టీజర్‌లోని విజువల్స్.. కథాంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా అందంగా రూపొందించారు. నివిన్ పాలీ, జోజు జార్జ్, ఇంద్రజిత్, సుదేవ్ నాయర్, మణికందన్, అర్జున్ అశోకన్, నిమిషా సజయన్, పూర్ణిమ ఇంద్రజిత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.