OG Team
OG Team : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా తాజాగా ఆదివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. వర్షం పడినా అభిమానులు పవన్ కోసం, పవన్ అభిమానుల కోసం ఉండటంతో ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇక ఈ ఈవెంట్లో పవన్ OG కాస్ట్యూమ్ డ్రెస్ తో రావడం, కటానాతో విన్యాసాలు చేయడం, ఆయన స్పీచ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.
వర్షం కారణంగా స్టేజిపై టీమ్ అంతా కలిసి ఫోటో దిగడానికి కుదరకపోవడంతో ఈవెంట్ అయ్యాక టీమ్ అందర్నీ కలిపి ఓ ఫోటో తీశారు ప్రమోషన్స్ కోసం. దీంతో OG టీమ్ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, ప్రియాంక మోహన్, సుజీత్, థమన్, సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, అర్జున్ దాస్ ఉన్నారు.
Also Read : OG Pre Release Event : OG ప్రీ రిలీజ్ ఈవెంట్.. వర్షంలో కూడా గ్రాండ్ సక్సెస్.. ఫొటోలు..