2022 Summer Movies: ఒకే వీక్.. ఒకే డేట్.. నెగ్గేదెవరో.. తగ్గేదెవరో?

ఏప్రిల్ నెలలో వస్తున్నాయి సరే.. కానీ ఒకే వీక్ ఒకే డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల పరిస్థితి ఏంటి.. ఆ డేట్ లో వేరే సినిమా ఉందని తెలిసినా.. క్లాష్ తప్పదని అర్థమవుతున్నా మేకర్స్..

2022 Summer Movies

2022 Summer Movies: ఏప్రిల్ నెలలో వస్తున్నాయి సరే.. కానీ ఒకే వీక్ ఒకే డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల పరిస్థితి ఏంటి.. ఆ డేట్ లో వేరే సినిమా ఉందని తెలిసినా.. క్లాష్ తప్పదని అర్థమవుతున్నా మేకర్స్.. సేమ్ డేట్ ఎందుకు ప్రకటిస్తున్నారు.. అసలు వీటిలో ఎన్ని సినిమాలు చెప్పిన డేట్ కి రాబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ముందు ఏప్రిల్ 14 అంటున్న వారి సంగతి చూద్దాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప నేషనల్ వైడ్ మాక్సిమమ్ అది పండుగ రోజు, హాలిడే. నెక్ట్స్ డే ఎలాగూ గుడ్ ఫ్రైడే ఉంది. తర్వాత వీకెండ్. సో వరుసగా నాలుగు రోజులు కలిసొచ్చే ప్యాకేజ్ పై ఫస్ట్ కన్నేసింది కేజీఎఫ్2.

Senior Hero’s: రిటైర్మెంట్ టైమ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్న సీనియర్ స్టార్స్!

అయితే అదే పండుగ రోజు రిలీజ్ అంటూ లాల్ సింగ్ చద్దా లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే ఏప్రిల్ 14ని తమిళనాడు, కేరళలో మన ఉగాదిలా జరుపుకుంటారు. సో విజయ్ బీస్ట్ కూడా ఏప్రిల్ 14నే అని పట్టుబట్టారని తెలుస్తోంది. అదే జరిగితే రాక్ స్టార్ యశ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్, తళపతి విజయ్ మధ్య ఒకే రోజు క్లాష్ రాక తప్పదు. ఏప్రిల్ 29న పవన్ కల్యాణ్ రాలేకపోతున్నారని తెలుసుకున్న ఆయన ఫ్యాన్ నితిన్.. అదే డేట్ కి తన సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. మాచర్ల నియోజక వర్గం చూపిస్తానంటున్నాడు. బట్ సేమ్ డేట్ ని రీసెంట్ గా లాక్ చేశాడు దిల్ రాజు. ఎఫ్3 ఏప్రిల్ 29న రాబోతుందని అనౌన్స్ చేశాడు. రెండు చిన్న సినిమాలే కానీ ఎఫ్3పై జనరల్ గా ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నితిన్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ రాబడతాడు.

Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

తెలుగులో ఏప్రిల్ 1 సర్కారు వారి పాట రాబోతుంది. అదే రోజు పాన్ ఇండియా వైడ్ మాధవన్ రాకెట్రీ రిలీజ్ కాబోతుంది. ఇందులో షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్ చేశాడు. అయితే మహేశ్ బాబు సినిమాకు తెలుగు రాష్ట్రాల వరకే కాబట్టి తిరుగుండదు. ఏప్రిల్ 29న రన్ వే 34, హీరోపంతి2 సినిమాల మధ్య పోరు తప్పేలా లేదు. అయితే ఈ క్లాష్ ముచ్చటంతా అవి అనుకున్న టైంకి వచ్చినప్పుడు మాత్రమే. ట్రిపుల్ ఆర్ వాయిదా దెబ్బకు మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త టెన్షన్ స్టార్టయింది. రాజమౌళి కొత్త డేట్ చెప్తే.. మళ్లీ అన్నీ షఫుల్ కాక తప్పదు. అదీకాక ఒమిక్రాన్ గట్టిగా దెబ్బకొడితే వీళ్లే వాయిదా అనొచ్చు. అప్పుడు ఏప్రిల్ నెలలో ఉండేవెన్నో.. బైబై చెప్పేసేవెన్నో చూడాలి.