‘హి ఈజ్ సో హాట్.. హి ఈజ్ సో క్యూట్.. ఓ బావా’ లిరికల్ సాంగ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ నుండి ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 18, 2019 / 11:54 AM IST
‘హి ఈజ్ సో హాట్.. హి ఈజ్ సో క్యూట్.. ఓ బావా’ లిరికల్ సాంగ్

Updated On : November 18, 2019 / 11:54 AM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ నుండి ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘పది మంది ఉండగా.. ప్రతిరోజు పండగే’.. టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సాయంత్రం ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

‘సంగీత్ విత్ స్వాగ్’ అంటూ సంగీత్ నేపథ్యంలో సాగే లిరికల్ వీడియో రిలీజ్ చేయగా క్షణాల్లో వైరల్ అయిపోయింది.. ‘లవ్యూ అంటూ వెంటపడలేదు.. డేటింగ్ అన్న మాటసలే రాదు.. హి ఈజ్ సో కూల్.. హి ఈజ్ సో క్యూట్.. ఫేకనిపించే టైపసలు కాదు.. బ్రేకప్ చెప్పే వీలసలు లేదు.. హి ఈజ్ సో హాట్.. హి ఈజ్ సో క్యూట్.. ఓ బావా మా అక్కని సక్కగా చూస్తావా.. ఓ బావా ఈ చుక్కని పెళ్లాడేస్తావా’.. అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.. థమన్ ట్యూన్, కేకే లిరిక్స్, సత్య యామిని,  మోహనా భోగరాజు, హరితేజల వాయిస్ పాటకు ప్లస్ అయ్యాయి..

Read Also : ‘నేను బతికే ఉన్నా.. ఇష్టం వచ్చినట్టు రాయకండి’ : డింపుల్ కపాడియా

కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానంగా రూపొందుతున్న ‘ప్రతిరోజూ పండగే’.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. విజయ్ కుమార్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. సంగీతం : థమన్, కెమెరా : జయ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : రవీందర్, నిర్మాత : బన్నీ వాసు.