Ooru Peru Bhairavakona : భైరవకోనలో ఏం జరిగింది? ఆసక్తికరంగా ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్

సందీప్ కిషన్ సినిమా 'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్ రిలీజైంది. ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.

Ooru Peru Bhairavakona : భైరవకోనలో ఏం జరిగింది? ఆసక్తికరంగా ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్

Ooru Peru Bhairavakona

Updated On : January 18, 2024 / 1:22 PM IST

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్-వీఐ ఆనంద్ కాంబోలో వస్తున్న ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం గరుడ పురాణం చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది.

HanuMan : తేజ సజ్జను సత్కరించిన కిషన్ రెడ్డి.. ‘హనుమాన్’ సక్సెస్‌పై ట్వీట్

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మిస్టరీ హారర్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9 న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నిజమే నే చెబుతున్నా’ అంటూ సాంగ్ లిరికల్ సాంగ్ అందరికీ తెగ నచ్చేసాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.  ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Akshay Kumar : 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరో భార్య.. ఎమోషనల్ అవుతూ భర్త పోస్టు

‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే భైరవ కోన’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన మాటల్ని బట్టి ఈ సినిమా మొత్తం గరుడ పురాణం చుట్టూ తిరుగుతుంది అనిపిస్తోంది. ట్రైలర్‌లో శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తికరంగా ఉంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఆనంద్ ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు డైరెక్ట్ చేసారు. ‘ప్రస్థానం’ సినిమాతో తన కెరియర్ మొదలుపెట్టి విభిన్నమైన సినిమాలతో అలరించిన సందీప్ కిషన్‌కి కొంతకాలంగా సరైన హిట్టు లేదు. ఈ సినిమా సందీప్‌కి తిరిగి సక్సెస్ తీసుకురావాలని ట్రైలర్ చూసిన అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ నటిస్తున్నారు.