Akshay Kumar : 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరో భార్య.. ఎమోషనల్ అవుతూ భర్త పోస్టు
50 సంవత్సరాల వయసులో ఆ స్టార్ హీరోయిన్ భార్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఇల్లు.. భర్త.. పిల్లలు అన్నీ చూసుకుంటూనే తన చదువులు కొనసాగించిన ఆ నటిని భర్త అభినందనలతో ముంచెత్తారు. ఎవరా నటి? అంటే..

Akshay Kumar
Akshay Kumar : 1995 లో ‘బర్సాత్’ మూవీతో బాలీవుడ్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి ట్వింకిల్ ఖన్నా స్టార్ హీరోయిన్‌గా వెలిగారు. 2001 లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను పెళ్లాడాక సినిమాలకు దూరంగా ఉన్నారు. రచయిత్రి, కాలమిస్ట్ కూడా అయిన ట్వింకిల్ తాజాగా మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన భార్యను చూసి ఎమోషనల్ అయ్యారు అక్షయ్. ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Suma Kanakala : వామ్మో.. వాయ్యో.. సుమ ఫోటో షూట్‌పై రాజీవ్ కనకాల రియాక్షన్
ట్వింకిల్ ఖన్నా 90 లలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ ఖిలాడీ, జుల్మీ, యే హై ముంబయి మేరీ జాన్, చల్ మేరే భాయ్, జోడీ నెంబర్ 1 వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన ‘శీను’ సినిమాలోనూ అలరించారు. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ డింపుల్-రాజేష్ ఖన్నాల కూతురైనా ఆ ప్రభావం తనపై లేకుండా తనదైన శైలిలో నటనతో పేరు తెచ్చుకున్నారు ట్వింకిల్. 2001 లో అక్షయ్ కుమార్‌ను పెళ్లాడిన ట్వింకిల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా రచయిత్రిగా, కాలమిస్టుగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల కోసం చదువుకి దూరమైన ట్వింకిల్ తన ఇష్టాన్ని కూడా నెరవేర్చుకున్నారు. 50 సంవత్సరాల వయసులో లండన్ గోల్డ్ స్మిత్స్ కాలేజీ నుండి మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు.
Sania Mirza : ఏదీ కష్టం.. పెళ్లి చేసుకోవడమా ? విడాకులు తీసుకోవడమా ?
ట్వింకిల్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై భర్త అక్షయ్ సంతోషం వ్యక్తం చేసారు. భార్యను అభినందిస్తూ పోస్టు పెట్టారు. ‘ రెండేళ్ళ క్రితం నువ్వు మళ్ళీ చదువుకోవాలని ఉంది అని నాతో అన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. ఇల్లు, కెరీర్, నేను మరియు పిల్లలను చూసుకుంటూనే చదువును పూర్తి చేసావు. నేను ఒక సూపర్ ఉమెన్‌ని పెళ్లి చేసుకున్నాను..నాకు ఎంతో గర్వంగా ఉంది.. కంగ్రాట్స్ మై లవ్’ అనే శీర్షికతో అక్షయ్ భార్య కోసం పోస్టు పెట్టారు. అక్షయ్ పోస్టుపై ‘ఇంతలా ప్రోత్సహించే భర్త దొరకడం నా అదృష్టం’ అంటూ ట్వింకిల్ స్పందించారు. చదువుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ వయసు ఒక అడ్డంకి కాదని ట్వింకిల్ నిరూపించారు. భార్య ఇష్టాన్ని గౌరవిస్తూ ఆమెకు ప్రోత్సాహాన్ని అందించిన అక్షయ్‌ని కూడా మెచ్చుకోవాలి.
View this post on Instagram
View this post on Instagram