Krishnam Raju : కృష్ణంరాజుకి సర్జరీ.. కాలి వేలుని తొలిగించిన వైద్యులు..

కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ..''ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారు. దీంతో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలిస్తే...

Krishnam Raju : కృష్ణంరాజుకి సర్జరీ.. కాలి వేలుని తొలిగించిన వైద్యులు..

Krishnam Raju

Updated On : March 9, 2022 / 10:53 AM IST

Krishnam Raju :  పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా మార్చ్ 11న రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. ప్రభాస్, పూజా హెగ్డే తో పాటు చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా భాగమయ్యారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్‌ గురించి, కృష్ణంరాజు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Shruti Haasan : మెగాస్టార్‌కి జోడిగా కమల్ కూతురు..

కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ..”ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారు. దీంతో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలిస్తే రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కంగారు పడే అవకాశం ఉంది అందుకే ఎవరికీ చెప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆపరేషన్‌ కారణంగానే ‘రాధేశ్యామ్‌’ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోతున్నారు. సినిమా విడుదల అయ్యాక మీడియా ముందుకు వస్తారు” అని తెలిపారు. రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య (ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించబోతున్నారు.