Producers : ఓటీటీ షాక్.. ప్రొడ్యూసర్స్ పరేషాన్.!
టాలీవుడ్ నిర్మాతలకు (Producers ) ఓటీటీ సంస్థలు పెద్ద షాకే ఇస్తున్నాయట.
OTT Platforms Give a Big Shock to Toxic Producers
Producers : టాలీవుడ్ నిర్మాతలకు ఓటీటీ సంస్థలు పెద్ద షాకే ఇస్తున్నాయట. ఓటీటీ ఇన్‌కమ్‌పై ఫుల్ హోప్స్ పెట్టుకుంటున్న మేకర్స్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందట. గతంలో థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ హక్కులను అమ్మేస్తే అదనంగా ఆదాయం వచ్చేది. ఈ లెక్కలను చూసుకొనే మూవీ బడ్జెట్‌ను పెంచేశారు. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు పెరిగిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు సీన్ సితార అయిపోయిందట. ఒకప్పుడు సినిమాను కొనేందుకు ఆసక్తి చూపిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు మేకర్స్ రిక్వెస్ట్ చేసినా వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతున్నాయట.
చిన్న, మిడిల్ రేంజ్ సినిమాల విషయంలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో డిజిటల్ డీల్స్ కుదరడం లేదన్న చర్చ సాగుతోంది. కొన్ని సందర్భాల్లో సినిమా హక్కులను కొనేందుకు బదులుగా, తమ ప్లాట్ఫామ్లో సినిమా ప్రదర్శించిన తర్వాత వచ్చిన వ్యూస్‌ను బట్టి రెవెన్యూ షేర్ చేసుకుందామని ప్రపోజల్స్ పెడుతున్నాయట ఓటీటీ సంస్థలు.
ఓటీటీ సంస్థలు ఆశించిన ధరకు సినిమాలను కొనుగోలు చేయకపోవడంతో కొందరు నిర్మాతలు ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుకుతున్నారట. ముఖ్యంగా సొంత యూట్యూబ్ ఛానళ్లలోనే సినిమాలను విడుదల చేస్తే.. వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్రకటనల రూపంలోనైనా ఎంతో కొంత వస్తుందని అంచనా వేస్తున్నారట. అయితే యూట్యూబ్‌లో రిలీజ్ చేసినంత మాత్రాన భారీ ఆదాయం వస్తుందనే గ్యారంటీ లేకపోయినా, ఓటీటీ డీల్ కోసం నెలల తరబడి ఎదురుచూడటం కంటే తమ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే మేలని కొందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
ఒకప్పుడు ఓటీటీ హక్కులే నిర్మాతలకు అదనపు ఆదాయ మార్గంగా ఉండగా, ఇప్పుడు అదే డీల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డిజిటల్ మార్కెట్లో మారుతున్న లెక్కలు మేకర్స్‌కు బిగ్ ఛాలెంజ్‌గా మారాయన్న చర్చ జరుగుతోంది.
