Thandel : నాగచైతన్య కోసం పాకిస్తాన్ సెట్.. ఎక్కడో తెలుసా?

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్.

Thandel : నాగచైతన్య కోసం పాకిస్తాన్ సెట్.. ఎక్కడో తెలుసా?

Pakisthan Set for Naga Chaitanya Thandel Movie with High Budget

Updated On : March 5, 2024 / 11:03 PM IST

Thandel Movie : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. GA2 పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ తర్వాత కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. మొదటిసారి చైతన్య ఓ ఫిషర్ మెన్ గా నటిస్తున్నాడు.

కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో పాక్ అధికారులు వాళ్ళని పట్టుకొని ఏం చేశారు, ఎలా బయటకి వచ్చారు అనే కథాంశంతో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో పాకిస్తాన్ జైల్లో ఉన్నట్టు ఓ సీన్ చూపించారు.

Also Read : Chadalavada Srinivasa Rao : పెద్ద హీరోలతో సినిమాలు చేయను.. ఇప్పుడు నిర్మాతలకు విలువ లేదు.. సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

అయితే ఈ తండేల్ సినిమా కోసం హైదరాబాద్ లోని BHEL వద్ద భారీ పాకిస్తాన్ సెట్ వేసారంట. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగల ఆధ్వర్యంలో భారీ బడ్జెట్ తో పాకిస్థాన్ పరిసరాలు, జైలు, ఆఫీస్ లు.. అన్ని పాకిస్తాన్ లో ఉన్నట్టే కనపడేలా సెట్ వేసారట. పాకిస్థాన్ సీన్స్ అన్ని ఈ సెట్స్ లోనే షూట్ చేయనున్నారు. మొత్తానికి తండేల్ సినిమాకి భారీగానే ఖర్చుపెడుతున్నారు. చైతన్య కూడా ఓ కొత్త కథతో రాబోతున్నాడు ఈ సినిమాతో. మరి తండేల్ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.