వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు : ‘పక్కా మాస్’ ట్రైలర్

దాదాపు 280కి పైగా టాలెంటెడ్ కిడ్స్ నటించిన కన్నడ సినిమా ‘గిర్మిత్’.. తెలుగులో ‘పక్కా మాస్’ పేరుతో విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 08:30 AM IST
వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు : ‘పక్కా మాస్’ ట్రైలర్

Updated On : October 29, 2019 / 8:30 AM IST

దాదాపు 280కి పైగా టాలెంటెడ్ కిడ్స్ నటించిన కన్నడ సినిమా ‘గిర్మిత్’.. తెలుగులో ‘పక్కా మాస్’ పేరుతో విడుదల కానుంది..

‘కేజీఎఫ్’ మూవీకి అద్భుతమైన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆకట్టుకున్న రవి బస్రూర్ దర్శకత్వంలో.. కన్నడలో ‘గిర్మిత్’ అనే సినిమా రూపొందింది. ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై రాజ్ కూమార్ నిర్మించాడు. ఈ సినిమాను తెలుగులో ‘పక్కా మాస్’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా అందరూ పిల్లలతో తెరకెక్కింది.

కన్నడలో ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ సమర్పించగా, మెయిన్ క్యారెక్టర్స్‌కి ‘రాక్‌స్టార్’ యశ్, ఆయన భార్య రాధికా పండిట్ డబ్బింగ్ చెప్పారు.. రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. పిల్లల గెటప్స్, బాడీ లాంగ్వేజ్ అంతా కమర్షియల్ సినిమాకు తీసిపోని విధంగా ఉంది.

Read Also : కీర్తి సురేష్ కొత్త సినిమా ‘గుడ్‌లక్ సఖీ’..

లవ్, కామెడీ, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో దాదాపు 280కి పైగా టాలెంటెడ్ కిడ్స్ నటించడం విశేషం. పిల్లలు చెప్పిన డైలాగ్స్, వేసిన స్టెప్స్ అదిరిపోయాయి.. నవంబర్ 8న ‘పక్కా మాస్’ విడుదల కానుంది.. సినిమాటోగ్రఫీ : సచిన్ బస్రూర్, సహ-నిర్మాతలు : సూరజ్ చౌదరి, నరేన్ చంద్ర చౌదరి..