Aadi Keshava : లీలమ్మో సాంగ్ వచ్చేసింది.. ఆ మూమెంట్స్ ఆ మాస్ స్టెప్పులు.. బాబోయ్..!
ఆదికేశవ నుంచి లీలమ్మో ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వైష్ణవ తేజ్ తో కలిసి శ్రీలీల మాస్ డాన్స్ వేసి అదరగొట్టేసింది.

Panja Vaisshnav Tej Sreeleela Aadi Keshava Leelammo lyrical Song release
Aadi Keshava : వైష్ణవ తేజ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ఆదికేశవ’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇటీవలే మొదలుపెట్టారు. సినిమాలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. కొన్నిరోజులు క్రితం ఈ సినిమాలోని మూడో సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఆ ప్రోమోలో శ్రీలీల డాన్స్ చూసి ఆడియన్స్ కి సాంగ్ పై ఆసక్తి పెరిగింది.
తాజాగా ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ‘లీలమ్మో’ అనే సాగే ఈ మాస్ బీట్ సాంగ్ కి వైష్ణవ తేజ్ తో కలిసి శ్రీలీల మాస్ డాన్స్ వేసి అదరగొట్టేసింది. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేసిన ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ తేజ్ కలిసి వేసిన ఆ మూమెంట్స్ ఆ మాస్ స్టెప్పులు చూస్తుంటే బాబోయ్ అనక ఉండరు. జివి ప్రకాష్ ఈ పాటకి సంగీతం అందించగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. మరి ఆ సాంగ్ లోని శ్రీలీల ఎనర్జీని మీరు కూడా చూసేయండి.
Also read : War 2 : స్పెయిన్‌లో వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో యాక్షన్ సీక్వెన్స్..
సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని నవంబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు పోస్టుపోన్ అవుతూ వచ్చింది. వైష్ణవ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఉప్పెన తరువాత చేసిన రెండు సినిమాలు వైష్ణవకి సరైన హిట్టు అందించలేకపోయాయి. మరి ఈ చిత్రంతో ఒక సూపర్ హిట్టుని అందుకొని కమ్‌బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.