Aadi Keshava : శ్రీలీలతో ప్రేమ.. విలన్స్‌తో శివతాండవం.. ‘ఆదికేశవ’ ట్రైలర్ రిలీజ్..

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో వైష్ణవ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆదికేశవ’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Aadi Keshava : శ్రీలీలతో ప్రేమ.. విలన్స్‌తో శివతాండవం.. ‘ఆదికేశవ’ ట్రైలర్ రిలీజ్..

Panja Vaisshnav Tej Sreeleela Aadikeshava Theatrical Trailer released

Updated On : November 20, 2023 / 5:59 PM IST

Aadi Keshava : ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ అవుతూ వచ్చిన వైష్ణవ తేజ్, శ్రీలీల నటించిన ‘ఆదికేశవ’ మూవీ.. ఈసారి పక్కా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫుల్ ప్రమోషన్స్ మోడ్ లో ఉన్న మూవీ టీం తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.

ఉద్యోగం చేయకుండా జాలిగా తిరిగే ఒక అబ్బాయి.. ఒక అమ్మాయితో ప్రేమలో పడడం ఆ తరువాత ఒక పెద్ద సమస్యని ఎదుర్కోవడం అనే కథాంశంతోనే ఈ చిత్రం కూడా రాబోతుందని అర్ధమవుతుంది. అయితే కథనం మాత్రం రెఫ్రెషింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ కొత్త ఫీలింగ్ ని అందిస్తుంది. హీరోయిన్ తో కామెడీ రొమాన్స్ చేస్తూ కనిపించిన హీరో.. ట్రైలర్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి విలన్స్ పై శివతాండవం ఆడుతూ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఊర మాస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Also read : Kiran Abbavaram : స్టార్ హీరోల్లా కిరణ్ అబ్బవరం కూడా.. సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారా?

ఇక నిర్మాతలు చెప్పినట్లు వైష్ణవ్ తేజ్ తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ మూవీలో గెటప్ వైజ్, క్యారెక్టర్ వైజ్ కొత్తగా కనిపించబోతున్నారని అర్ధమవుతుంది. ఇక శ్రీలీల తన క్యూట్ పర్ఫామెన్స్ తో ట్రైలర్ లోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ ఈ సినిమాలో విలన్ కనిపించబోతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.