Paruchuri Brothers : మనవడి సినిమా గురించి మాట్లాడిన పరుచూరి బ్రదర్స్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ తమ మనవడి సినిమా గురించి మాట్లాడారు.

Paruchuri Brother Grand Son Paruchuri Sudarshan Mr Celebrity Movie Release Date Announced

Paruchuri Brothers : టాలీవుడ్ సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ రచయితలుగా, నటులుగా ఎన్నో సినిమాలకు పని చేసి మెప్పించారు. ఇప్పుడు వాళ్ళ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా రాబోతున్నాడు. ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే సినిమాతో పరుచూరి సుదర్శన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. N పాండురంగారావు, చిన్నరెడ్డయ్య నిర్మాణంలో ఆర్‌పి సినిమాస్ బ్యానర్ పై రవి కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చూశారా..? ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు..

ఇప్పటికే మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ తమ మనవడి సినిమా గురించి మాట్లాడారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతుంది. మమ్మల్ని ఆదరించినట్టే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్త దర్శకుడైనా ఈ సినిమా తీసాడు అని అన్నారు. ఇక పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ సినిమాతో వస్తున్నాడు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. ఏ సినిమాని ఆదరించండి అని అన్నారు.