మరోసారి ఆలోచించండి: స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై పరుచూరి పలుకు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే వేరువేరుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద వర్గాల విద్యార్ధులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు బాగుండాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత విద్యలో ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై రాజకీయంగా మాత్రం పెద్దగా విమర్శలు వినిపించట్లేదు. కాకపోతే ఇదే నిర్ణయం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న సమయంలో అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం అంతగా వ్యతిరేకత లేదు. లేటెస్ట్ గా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై తెలుగు సినిమా రచయిత పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు.
మాతృ భాష అమ్మ పాలవంటిది, పరాయి భాష డబ్బా పాలవంటిది అని మహాత్ముడు చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంగ్ల భాషా బోధనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించవలసిందిగా మనవి చేశారు.
అసలు ప్రభుత్వం నిర్ణయం ఏమిటంటే..? 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. తర్వాత రెండేళ్లకు 9, 10 తరగతులు కూడా ఇంగ్లీష్ మీడియంలుగా మారిపోతాయి. అంతేకాదు 500మంది విద్యార్ధులు దాటిన ప్రతి ఉన్నత పాఠశాలనూ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తారు. అయితే తెలగు మాత్రం ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది.
ఈ నిర్ణయం సుధీర్ఘ కాలంలో మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అయితే దీనిపై తెలుగు భాషా అభిమానులు మాత్రం కాస్త పెదవి విరుస్తున్నారు. ఇప్పడు ఉన్న టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధించే సామర్థ్యం ఉందా? అనేది అనుమానమే.
మాతృ భాష అమ్మ పాలవంటిది, పరాయి భాష డబ్బా పాలవంటిది అని మహాత్ముడు చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆంగ్ల భాషా బోధనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను ?
— Paruchuri GK (@GkParuchuri) November 8, 2019