Pawan- Balayya : అన్‌స్టాపబుల్ పవర్.. పవన్‌తో బాలయ్య షో.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా అభిమానులు..
అన్‌స్టాపబుల్ షో పై మరిన్ని అంచనాలు పెంచేయడానికి ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని తీసుకొస్తున్నారు. నేడు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో.....................

pawan kalyan balakrishna Unstoppable show shooting
Pawan- Balayya : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ రానున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవ్వనుంది. ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ – బాలయ్య ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అన్‌స్టాపబుల్ షో పై మరిన్ని అంచనాలు పెంచేయడానికి ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని తీసుకొస్తున్నారు. నేడు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూట్ జరగనుంది. దీంతో బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకి భారీగా చేరుకొని నినాదాలు చేస్తున్నారు.
Karthikeya 3 : కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చిన నిఖిల్..
జై బాలయ్య, జై పవర్ స్టార్ అంటూ అభిమానులు స్టూడియో బయట హంగామా చేస్తున్నారు. దీంతో షూట్ కూడా అవ్వకుండానే పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎపిసోడ్ లో ఏం మాట్లాడతారు? సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మాట్లాడతారా అని ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. మొత్తానికి పవన్ – బాలయ్య ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లేలా చేస్తున్నారు ఆహా టీం.