Toliprema Re Release : పవన్ క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రీ రిలీజ్‌కి రెడీ అవుతుంది.. ఎప్పుడో తెలుసా?

పవన్ కళ్యాణ్ క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమని 4K ప్రింట్‌తో థియేటర్ లో చూసి అప్పటి మ్యాజిక్ ని ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా. అయితే రెడీ అవ్వండి ఈ మూవీని..

Toliprema Re Release : పవన్ క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రీ రిలీజ్‌కి రెడీ అవుతుంది.. ఎప్పుడో తెలుసా?

Pawan Kalyan classical love story Toliprema re release date

Updated On : May 24, 2023 / 6:08 PM IST

Pawan Kalyan Toliprema : టాలీవుడ్ లో మొదలైన రీ రిలీజ్‌ల ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలను ఆకర్షిస్తుంది. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోని చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. తాజాగా 90’s బ్లాక్ బస్టర్ తొలిప్రేమ రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అప్పటి యూత్ ని ప్రేమలో పడేసింది. అప్పుడే కాదు ఇప్పటి వారికి కూడా ఆ సినిమా అంటే ఒక ఫీల్ వస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది.

Bro : స్పెషల్ సాంగ్‌లో Bro తో చిందేయడానికి పోటీ పడుతున్న భామలు.. నిజమేనా?

ప్రియురాలు కోసం పవన్ పడే వేదన అందర్నీ ఫీల్ అయ్యేలా చేసింది. కేవలం హీరోహీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్ ని కూడా దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా అన్న చెల్లి రిలేషన్ ని ఎంటర్టైన్ గా చూపిస్తూనే.. ఆ బంధంలో చూపించిన ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పరిచయం చేసే సీన్ రెఫెరెన్స్ తో ఇప్పటి సినిమాల్లో కూడా పలు సీన్స్ కనిపిస్తాయి. కీర్తిరెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కరుణాకరన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Bro : మార్క్ ని పరిచయం చేసిన బ్రో.. మామా అల్లుళ్ళ లుక్స్ అదుర్స్‌!

ఈ సినిమాకి మరో హైలైట్ సంగీత దర్శకుడు దేవా ఇచ్చిన మ్యూజిక్. తొలిప్రేమలోని ప్రతి సాంగ్ ఇప్పటికి ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ స్థానం ఉంటుంది. అన్ని రకాలుగా అలరించిన ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుండడంతో జూన్‌ 30న 4K ప్రింట్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ఈ మూవీ రీ రిలీజ్ కోసం చూస్తున్న టాలీవుడ్ అభిమానులు.. థియేటర్ లో తొలిప్రేమ మ్యాజిక్ ని ఫీల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.