Pawan Kalyan Bro : మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ్రో టీజర్ డబ్బింగ్ కంప్లీట్.. టీజర్ వచ్చేస్తుంది!

బ్రో మూవీ టీజర్ కి పవన్ డబ్బింగ్ పూర్తి చేసేశాడు. ఈ డబ్బింగ్ ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డబ్బింగ్ చెప్పేలా ఏర్పాటు చేశారు.

Pawan Kalyan Bro : మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ్రో టీజర్ డబ్బింగ్ కంప్లీట్.. టీజర్ వచ్చేస్తుంది!

Pawan Kalyan complete his dubbing for Bro teaser at mangalagiri party office

Updated On : June 28, 2023 / 4:46 PM IST

Pawan Kalyan Bro : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళంలో తెరకెక్కించిన డైరెక్టర్ సముద్రఖని తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్లు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే పవన్ అండ్ తేజ్ పోస్టర్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల లుంగీ కట్టులో రిలీజ్ చేసిన పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

Rajamouli : ఫ్యామిలీతో వెకేషన్‌కి చెక్కేసిన రాజమౌళి.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా..

తాజాగా ఈ సినిమా టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ కి సంబంధించిన పవన్ డబ్బింగ్ పూర్తి కాకపోవడంతో టీజర్ రిలీజ్ టైం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు పవన్ కూడా తన డబ్బింగ్ ని పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో డబ్బింగ్ పూర్తి చేసేందుకు మూవీ టీం.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డబ్బింగ్ చెప్పేలా ఏర్పాటు చేశారు. దర్శకుడు సముద్రఖని మంగళగిరి వచ్చి పవన్ చేత టీజర్ కి డబ్బింగ్ కంప్లీట్ చేయించాడు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అలాగే టీజర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన సంగీతం మంచి హైప్ ని క్రియేట్ చేసింది. దీంతో టీజర్ కి ఏ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడా? అని అందరిలో ఆసక్తి నెలకుంది.