Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చేసాడు.. షూటింగ్ వీడియో రిలీజ్.. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ పూర్తి చేస్తున్న పవన్..

రెండు సినిమాల షూటింగ్స్ నెల రోజుల గ్యాప్ లో పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోకి అడుగు పెట్టాడు పవన్.

Pawan Kalyan Enters in Ustaad Bhagat Singh Shoot Video Released

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీతో చేతిలో ఉన్న సినిమాలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎపుడో అనౌన్స్ చేసిన సినిమాలు కూడా పవన్ డేట్స్ కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసాయి. ఇటీవల పవన్ కొన్ని నెలల క్రితం తన సినిమాల నిర్మాతలతో మీటింగ్ పెట్టి ఎలాగైనా ఆగస్టు కల్లా సినిమా షూటింగ్స్ పూర్తి చేసేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తూ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.

మొదట హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చి ఆ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసేశారు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమాకు కూడా రెండు వారాల డేట్స్ ఇచ్చి త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసాడు. రెండు రోజుల క్రితమే OG షూటింగ్ పూర్తిచేసాడు. అలా రెండు సినిమాల షూటింగ్స్ నెల రోజుల గ్యాప్ లో పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోకి అడుగు పెట్టాడు.

Also Read : Trivikram – NTR – Allu Arjun : త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లు అర్జున్.. కార్తికేయుడిగా ఎన్టీఆర్.. నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసారు. కానీ తేరి ఆల్రెడీ హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ అవ్వడం, పొలిటికల్ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు కథ మొత్తం మార్చేసి కొత్త కథతో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి పవన్ షూట్ లో జాయిన్ అయిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రీలీల కూడా ఉండటం గమనార్హం.

 

Also Read : AA22xA6 : రేప‌టి నుంచే అల్లు అర్జున్‌, అట్లీల మూవీ షూటింగ్.. దీపికాతో పాటు ఆ హీరోయిన్ కూడా..