Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?

రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Release Date Leaked by Book My Show

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు అయిదేళ్ల క్రితం మొదలయి ఎట్టకేలకు ఇటీవలే పూర్తయింది. పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమా సాగుతూ వచ్చింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా హరిహర వీరమల్లు సినిమాని మే 30 లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా బుక్ మై షో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ని లీక్ చేసింది. బుక్ మై షోలో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ 2025 జూన్ 12 అని పోస్ట్ చేసింది. జూన్ రెండో వారంలో సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని వార్తలు వచ్చాయి కాబట్టి ఇదే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.

Also Read : Jacqueliene Fernandez : ఈ హీరోయిన్ కి ఏకంగా ప్రైవేట్ ఐలాండ్ ఉందని తెలుసా? ఎక్కడ? ఎన్ని కోట్లకు కొనుక్కుందో తెలుసా?

అయితే మూవీ యూనిట్ మాత్రం అధికారికంగా హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. మరి బుక్ మై షో పెట్టిన జూన్ 12 నే రిలీజ్ చేస్తారా లేకా ఇంకో కొత్త డేట్ ఇస్తారా చూడాలి.

Also Read : Acharya : చిరంజీవి కంటే ముందే శ్రీకాంత్ ‘ఆచార్య’.. ఈ సినిమా గురించి తెలుసా?