Jacqueliene Fernandez : ఈ హీరోయిన్ కి ఏకంగా ప్రైవేట్ ఐలాండ్ ఉందని తెలుసా? ఎక్కడ? ఎన్ని కోట్లకు కొనుక్కుందో తెలుసా?

ఓ బాలీవుడ్ భామ కూడా ఒక ఐలాండ్ ని కొనుక్కుంది.

Jacqueliene Fernandez : ఈ హీరోయిన్ కి ఏకంగా ప్రైవేట్ ఐలాండ్ ఉందని తెలుసా? ఎక్కడ? ఎన్ని కోట్లకు కొనుక్కుందో తెలుసా?

Do You Know Bollywood Actress Jacqueliene Fernandez Buys Private Island

Updated On : May 8, 2025 / 1:54 PM IST

Jacqueliene Fernandez : డబ్బున్న సెలబ్రిటీలకు లగ్జరీ ఇల్లు, కార్లు, విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ జెట్స్ ఉండటం సహజమే. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు ఇలాంటి ఖరీదన ఆస్తులు కొనుక్కోవడంలో ముందు ఉంటారు. బాగా డబ్బున్న వ్యాపారవేత్తలు కొంతమంది అయితే కోట్లు పెట్టి చిన్న చిన్న ఐలాండ్స్ ని కూడా కొనుక్కుంటారు. అలా ఓ బాలీవుడ్ భామ కూడా ఒక ఐలాండ్ ని కొనుక్కుంది.

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ తో, కీలక పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఈ అమ్మడికి బాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ ఉంది. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది జాక్వెలిన్.

Also Read : Acharya : చిరంజీవి కంటే ముందే శ్రీకాంత్ ‘ఆచార్య’.. ఈ సినిమా గురించి తెలుసా?

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గతంలో 2012లో తన దేశం శ్రీలంక దగ్గర ఒక చిన్న దీవిని కొనుక్కుంది. శ్రీలంకకు దక్షిణ భాగంలో ఉన్న ఒక నాలుగు ఎకరాల చిన్న దీవిని 2012లో అప్పటి లెక్కల ప్రకారం దాదాపు 3.5 కోట్లతో కొనుక్కుంది. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఆ దీవిలో తను ఒక ఖరీదైన విల్లా కడతాను అని కూడా ప్రకటించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆ దీవి గురించి మాట్లాడలేదు. మరి జాక్వెలిన్ కొన్న దీవిలో విల్లా కట్టిందా? ఆ దీవికి జాక్వెలిన్ వెళ్తుందా అనేది ప్రశ్నగానే మిగిలింది.