Acharya : చిరంజీవి కంటే ముందే శ్రీకాంత్ ‘ఆచార్య’.. ఈ సినిమా గురించి తెలుసా?

చిరంజీవి - రామ్ చరణ్ కంటే ముందే ఆచార్య టైటిల్ తో శ్రీకాంత్ ఓ సినిమా మొదలుపెట్టాడని తెలుసా?

Acharya : చిరంజీవి కంటే ముందే శ్రీకాంత్ ‘ఆచార్య’.. ఈ సినిమా గురించి తెలుసా?

Do You Know about Srikanth Achaya Movie Before Chiranjeevi Ram Charan

Updated On : May 8, 2025 / 12:19 PM IST

Acharya : చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 2022 లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి – రామ్ చరణ్ కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆచార్య సినిమా భారీ పరాజయం పాలైంది. అయితే చిరంజీవి – రామ్ చరణ్ కంటే ముందే ఆచార్య టైటిల్ తో శ్రీకాంత్ ఓ సినిమా మొదలుపెట్టాడని తెలుసా?

2013లో శ్రీకాంత్ హీరోగా ఆచార్య అనే సినిమాని ప్రకటించారు. రక్ష సినిమా ఫేమ్ డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ సినిమాని అనౌన్స్ చేసారు. లేపాక్షి బ్యానర్ పై గురురాజ్ నిర్మాణంలో ఈ సినిమా అనౌన్స్ చేసి ఓపెనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఓపెనింగ్ లో సునీల్ శ్రీకాంత్ పై క్లాప్ కూడా కొట్టారు.

Do You Know about Srikanth Achaya Movie Before Chiranjeevi Ram Charan

Also Read : Y Vijaya : వై విజయ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇంత క్లోజా.. బాలయ్య వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి..

ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో షూటింగ్ కూడా చేసారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో, లేదా ఆర్ధిక సమస్యల వల్లో సినిమా మాత్రం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాని మొదలుపెట్టలేదు. అలా శ్రీకాంత్ ఆచార్య సినిమా మొదలయి ఒక షెడ్యూల్ షూటింగ్ అవ్వగానే ఆగిపోయింది.

Do You Know about Srikanth Achaya Movie Before Chiranjeevi Ram Charan