Y Vijaya : వై విజయ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇంత క్లోజా.. బాలయ్య వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.

Y Vijaya : వై విజయ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇంత క్లోజా.. బాలయ్య వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి..

Senior Actress Y Vijaya Interesting Comments on Balakrishna and NTR Family

Updated On : May 8, 2025 / 11:51 AM IST

Y Vijaya : ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో అలరిస్తున్నారు వై.విజయ. గతంలో ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేసారు వై విజయ. ఆ తర్వాత బాలయ్య సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.

Also Read : Sundeep Kishan : తమిళ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా.. మేకింగ్ వీడియో చూశారా?

వై విజయ మాట్లాడుతూ.. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను 11 ఏళ్ళప్పుడు చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ చినవెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకోడానికి వెళ్లేదాన్ని. అక్కడికి ఎన్టీఆర్ పిల్లలు వచ్చేవాళ్ళు. అక్కడ మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాలయ్యతోఅనేక సినిమాల్లో నటించాను.

ఓ సారి రాజమండ్రిలో షూట్ జరిగితే షూట్ అయ్యాక బాలయ్య అత్తయ్య గారి ఊరు కాకినాడ కావడంతో అక్కడికి డిన్నర్ కి తీసుకెళ్లారు. షూటింగ్ లో బాలయ్యతో ఉంటే ఆయన భార్య వసుంధర, అక్క పురంధేశ్వరికి కాల్ చేసి విజయతో మాట్లాడండి అని ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారి భార్య భువనేశ్వరిని ఒకసారి సూపర్ మార్కెట్ లో కలిసాను. నన్ను గుర్తుపట్టి బాగా మాట్లాడింది. ఇంటికి రమ్మని పిలిచింది అంటూ ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.

Also Read : Y Vijaya : సీనియర్ నటి వై.విజయకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? చెన్నైలోనే..