Sundeep Kishan : తమిళ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా.. మేకింగ్ వీడియో చూశారా?
జాసన్ సంజయ్, సందీప్ కిషన్ సినిమా మేకింగ్ వీడియో మీరు కూడా చూసేయండి..

Sundeep Kishan Vijay Son Jason Sanjay Movie Making Video Released
Sundeep Kishan : తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని ప్రకటించారు.
నిన్న సందీప్ కిషన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే ఇది యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ వీడియోలో జాసన్ సంజయ్ డైరెక్షన్ చేసినట్టు మేకింగ్ విజువల్స్ ఉండటంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ తో పాటు, సందీప్ కిషన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Y Vijaya : సీనియర్ నటి వై.విజయకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? చెన్నైలోనే..
జాసన్ సంజయ్, సందీప్ కిషన్ సినిమా మేకింగ్ వీడియో మీరు కూడా చూసేయండి..