Pawan Kalyan HariHara VeeraMallu Postponed again Rumors goes Viral
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయాలని కుదిరినప్పుడల్లా డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఫుల్ బిజీగా ఉండటంతో డేట్స్ కూడా ఇవ్వలేకపోతుండటంతో సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమా త్వరలోనే అయిపోద్ది అనుకున్నారు.
మూవీ యూనిట్ కూడా మార్చ్ 28న హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 1 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే అనేకమార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి వాయిదా వేశారు. చివరగా 2025 మార్చ్ 28 మాత్రం ఫిక్స్ అనుకున్నారు. తాజాగా ఆసినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండటంతో చెప్పిన డేట్ కి వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా వాయిదా పడ్డట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read : MAD Square : సూపర్ హిట్ మ్యాడ్ సీక్వెల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడంటే?
నితిన్ రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28 రిలీజ్ చేస్తామని నేడు ప్రకటించారు. అలాగే మ్యాడ్ సీక్వెల్ సినిమా కూడా మార్చ్ 29 రిలీజ్ అని నేడు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో హరిహర వీరమల్లు వాయిదా పడుతుంది కాబట్టే ఇవి అనౌన్స్ చేసారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. పవన్ కి పోటీగా పవన్ వీరాభిమాని నితిన్ అయితే రాడు. నితిన్ అదే డేట్ ఇచ్చాడు అంటే కచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడుతున్నట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందుతున్నారు.
ఈ డేట్ కూడా వాయిదా పడిందంటే ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ఇంకా 7 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్నారు. మరి దానికి డేట్స్ ఎప్పుడు ఇస్తారో, అది ఎప్పుడు అవుతుందో చూడాలి. ఫ్యాన్స్ ఏమో OG సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దానికి పవన్ కనీసం మూడు వారాలు అయినా డేట్స్ ఇవ్వాలి. హరిహర వీరమల్లు సినిమా పూర్తయితే కానీ దానికి డేట్స్ ఇవ్వడు. దీంతో ఇదే మళ్ళీ వాయిదా పడిందంటే OG ఇంకెప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాలు ఫాస్ట్ గా అవ్వాలి అంటే పవన్ చేతిలోనే ఉంది. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్స్ చేయడానికి రెండు మూవీ యూనిట్స్ రెడీగా ఉన్నాయి.