Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh regular shoot begins
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్, హరీష్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురు చూపులను నెరవేరుస్తూ.. ఉస్తాద్ సినిమాని పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే పవన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో ఉస్తాద్ ఎప్పుడు మొదలు అవుతుందో అనుకున్నారు అంతా.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి మొదలు కాబోతుంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు (ఏప్రిల్ 5) హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తుంటే ఆ వార్తలు నిజమనేలా ఉన్నాయి. ”ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే” అనే సాంగ్ ని పోస్ట్ చేశాడు. దీని బట్టి చూస్తే ఈ మూవీ షూటింగ్ నేడు మొదలైనట్లు అర్ధమవుతుంది. కాగా ఈ చిత్రం తమిళ సినిమా ‘తేరి’కి రీమేక్ వస్తుందని తెలుస్తుంది.
ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. అయితే ఉస్తాద్ కోసం కేవలం ఆ సినిమా స్టోరీ లైన్ మాత్రమే తీసుకోని, కథలో చాలా చేంజెస్ చేశారని తెలుస్తుంది. తేరిలో హీరో పోలీస్ పాత్రలో కనిపిస్తే, ఉస్తాద్ లో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ మూవీ కోసం పవన్ 50 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడట. మే మూడో వారం నాటికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి హరి హర వీరమల్లులో (Hari Hara Veera Mallu) పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023