‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ రిలీజ్.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది..

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ గ్లింప్స్ వచ్చేసింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ రిలీజ్.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది..

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Glimpse released

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి కలిసి పని చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ కి గ్యాప్ తీసుకుంది. అయితే ఈ మూవీ నుంచి ఇటీవల మేకర్స్ ఒక సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు.

మూవీ నుంచి ఒక గ్లింప్స్ తీసుకు రాబోతున్నట్లు తెలియజేసారు. పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను కూడా హరీష్ శంకర్ షేర్ చేసి ఆడియన్స్ ని ఖుషి చేసారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ గ్లింప్స్ కోసం ఆశగా ఎదురు చూసారు. తాజాగా ఈ గ్లింప్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పొలిటికల్ టచ్ తో గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ పవన్ ఫ్యాన్స్ ని, జనసైనికులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Also read : Samantha : సమంత వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్.. బన్నీ కోసం హనీగా మారిన సమంత..

కాగా ఈ సినిమా తమిళ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ కథతోనే వస్తున్నట్లు తెలుస్తుంది. హిందూ, ముస్లిం మధ్య గొడవల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు అనిపిస్తుంది. గ్లింప్స్ అయితే మూవీ పై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్.. ఈ చిత్రంతో గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారేమో చూడాలి.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇక గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది.