బిల్లా-రంగా.. ‘అన్నయ్య’ టైటిల్‌తో ‘తమ్ముడు’ సినిమా!..

  • Published By: sekhar ,Published On : October 26, 2020 / 03:39 PM IST
బిల్లా-రంగా.. ‘అన్నయ్య’ టైటిల్‌తో ‘తమ్ముడు’ సినిమా!..

Updated On : October 28, 2020 / 1:22 PM IST

Billa Ranga – Pawan Kalyan: రీసెంట్ క్రేజీ రీమేక్స్‌లో కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’.. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రయత్నాలు చేస్తోంది. బాలయ్య, రానా, రవితేజ ఇలా పలువురు హీరోల పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బిజు మీనన్ చేసిన పోలీస్ క్యారెక్టర్ పవన్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్రలో రానాకనిపించనున్నాడని సమాచారం.


తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ పేరు ఫిక్స్ చేశారట.
1982లో మెగాస్టార్ చిరంజీవి, డా. మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో నటించిన ఈ క్లాసిక‌్ మూవీ అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యింది.Sasikumar and Sarath Kumar team up for superhit remake? - Tamil News - IndiaGlitz.comకాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ మూవీకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని, బిల్లాగా ప‌వ‌ర్‌స్టార్, రంగానా రానా న‌టిస్తార‌ని టాక్ న‌డుస్తుంది. మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోలో ‘బిల్లా.. రంగా’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తోంది. దీంతో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌కి ఈ పేరే ఫిక్స్ చేశారని సమాచారం. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
https://10tv.in/why-pawan-kalyan-not-responding-on-ap-people-problems/