Pawan Kalyan OG glimpse to be screened with sankranthi release movies
OG Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికి మరోపక్క తాను ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోండగా, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పవన్ అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ ఇచ్చేందుకు ఓజీ బృందం సిద్ధమైందట. ఓ గ్లింప్స్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్లింప్స్‌కు సంబంధించిన వర్క్ పూరైందట. ఈ గ్లింప్స్ నిడివి 1.39 నిమిషాలు ఉన్నట్లు టాక్.
ఈ ఓజీ గ్లింప్స్ ను సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమాలతో కలిసి థియేటర్లలో వేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే పవన్ అభిమానులు డబుల్ భోనాంజే అని చెప్పొచ్చు. కాగా సుజిత్ ఎలాంటి విజువల్స్‌తో గ్లింప్స్ కట్ చేశాడనేది ఆసక్తి నెలకొంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.