Pawn Kalyan : నటుడు చలపతికి నివాళ్లు అర్పించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ళ వయసు చలపతి గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. అయన అకాల మరణం సినీ పరిశ్రమని కలిచివేసింది. చలపతి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా చలపతి రావుకి నివాళ్లు అర్పించాడు.

Pawn Kalyan : నటుడు చలపతికి నివాళ్లు అర్పించిన పవన్ కళ్యాణ్..

pawan kalyan pay his last recpects to Chalapathi Rao

Updated On : December 25, 2022 / 10:37 AM IST

Chalapathi Rao : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ళ వయసు చలపతి గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. అయన అకాల మరణం సినీ పరిశ్రమని కలిచివేసింది. చలపతి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా చలపతి రావుకి నివాళ్లు అర్పించాడు.

Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

“ప్రముఖ నటులు శ్రీ చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు గారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. శ్రీ చలపతిరావు గారి కుమారుడు.. నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం” అంటూ తన సంతాపం తెలియజేశాడు.

కాగా చలపతి రావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉంది. అప్పటి వరకు చలపతి రావు భౌతికకాయాన్ని జూబిలీహిల్స్ మహాప్రస్థానం ఫ్రీజర్ లో పెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు చలపతి కుమారుడు రవిబాబు ఇంటివద్దే ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. చలపతికి నివాళ్లు అర్పించేందుకు సినీ ప్రముఖులు రవిబాబు ఇంటికి చేరుకుంటున్నారు.