Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క ఏపీలో ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా బిజీగా ఉంటూనే చేతులో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తూ షూటింగ్స్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పవన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, పవన్ కొత్త ఫొటోలు వచ్చినా వైరల్ అవ్వాల్సిందే.
తాజాగా పవన్ కళ్యాణ్ ఫొటోలు రెండు వైరల్ గా మారాయి. ప్రస్తుతం పవన్ హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో నిన్న శనివారం నటుడు RK సాగర తన ది 100 సినిమా ట్రైలర్ ని పవన్ చేత లాంచ్ చేయించారు. దీంతో పవన్ ఉస్తాద్ సినిమా డ్రెస్ లో కనిపించారు
Also Read : Ravi Kishan : పాలతో స్నానం.. గులాబీ పూల మీద నిద్ర.. దెబ్బకు సినిమా అవకాశాలు పోవడంతో..
ట్రైలర్ లాంచ్ కి సంబంధించి మూవీ యూనిట్ తో పవన్ దిగిన ఫొటోలు నిన్న వైరల్ గా మారాయి. తాజాగా పవన్ స్టైలిష్ గా కూర్చున్న ఫొటో, పవన్ స్వాగ్ తో నడుస్తున్న ఫొటోలు బయటకు రావడంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. పవన్ నడుస్తున్న ఫొటో వకీల్ సాబ్ లుక్ ని గుర్తుచేస్తుంది, పవన్ స్వాగ్ అదిరింది అంటున్నారు ఫ్యాన్స్.
అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ వైట్ & వైట్ డ్రెస్ లో కనిపిస్తున్న పవన్ ఇటీవల సినిమా షూటింగ్స్ వల్ల అప్పుడప్పుడు కలర్ ఫుల్ గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nidhhi Agerwal : పవన్ సినిమా అవ్వగానే ఈ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్..? ఏ హీరో కోసమో తెలుసా?